ప్రధాని మోదీ హామీపై నెటిజన్స్ కామెంట్శ్..!

Tuesday, October 8th, 2019, 02:42:34 AM IST

దేశంలో వరుసగా రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక మార్పులకు శ్రీకారం చుడుతుంది. మోదీ, షా ద్వయంతో దేశాన్ని అభివృధి బాటలో నడిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చాకా పదేపదే చెప్పిన మాట ఒక్కటే విదేశాలలో ఉన్న నల్ల డబ్బును తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో రూ. 15 లక్షల రూపాయలు జమచేస్తానని చెప్పాడు.

అయితే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా భారతీయుల తొలివిడత స్విస్ అకౌంట్ల వివరాలు అందాయి. అయితే తాజాగా మోదీ ఇచ్చిన హామీనీ గుర్తుచేసుకుంటూ త్వరలోనే ప్రతి పేదవాడి బ్యాంక్ ఖాతాలలోకి రూ. 15 లక్షలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు.