జగన్ సరికొత్త నిర్ణయం పై అందరికీ ఒకటే డౌట్..!

Wednesday, July 15th, 2020, 01:08:40 PM IST

ప్రస్తుత కరోనా కష్ట కాలంలో ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ తీరు చాలా బాగుంది అని చెప్పాలి. అయితే తాను తీసుకున్న చర్యలు మంచివే అయినప్పటికీ మార్పు లేని చర్యలు అలా ఎన్ని తీసుకున్నా మొదట్లో అందరూ హర్షించినా తర్వాత మాత్రం ఎదురు దెబ్బలు తప్పవు. ఇప్పుడు జగన్ అదే పరిస్థితుల్లో ఉన్నారు.

విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా మరణాలకు సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. కరోనా వచ్చి చనిపోతే వారి అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఇది బాగానే ఉంది కానీ ఇక్కడే నెటిజన్స్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

అసలు కరోనా వచ్చి ఓ మనిషి చనిపోతే ఆ శవాన్నే ఇవ్వట్లేదు కదా..? మరి అంత్యక్రియలు అని చెప్పి ఈ 15 వేలు ప్రకటించడం ఏమిటో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లాజికల్ ప్రశ్నకు వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.