భయంతోనే జగన్,చంద్రబాబులు ఇలా చేస్తున్నారా.?

Tuesday, July 9th, 2019, 10:05:39 AM IST

ఏపీలోని సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి.ఏపీ నాయకులు మరియు రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూసిన ఒక మహా అధ్యాయం ముగిసింది.కానీ ఇన్నాళ్ల రాజకీయాలను ఎప్పటి నుంచో పరిశీలిస్తున్న సామాన్యుడు మాత్రం మన నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇంకా అసంతృప్తిగానే ఉన్నారని సోషల్ మీడియా అధ్యయనంలో తేలింది.వీరు అధికారం మారితే వారు చేసిన పనులు వారు అధికారం మారితే వీరు చేసిన పనులు జస్ట్ పేర్లు మార్చుతున్నారు తప్ప నిజమైన చిత్తశుద్ధి చూపడం లేదని సగటు సామాన్యుడు ఆవేదన చెందుతున్నాడు.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎంతసేపు ప్రభుత్వ పథకాలకు వారి పేర్లు వారి పార్టీ వ్యవస్థాపకులు పేర్లు పెట్టుకుంటున్నారే తప్ప దేశం కోసం కానీ మన రాష్ట్రం కోసం కానీ ప్రాణాలు అర్పించిన ఎంతో మంది గొప్ప నాయకులు స్వాతంత్ర సమరయోధులు పేర్లు పెట్టడానికి ఎందుకు మనసు రావట్లేదని అంటున్నారు.ఓహో ఒకరకంగా వారి తండ్రి పేర్లు పార్టీ వ్యవస్థాపకుల పేర్లు పెట్టి జనంలో వారి పార్టీ మనుగడను నిరంతరంగా కొనసాగించేందుకు ఇదొక ట్రిక్ అయ్యి ఉంటుంది.ఇంత భయం ఎందుకు మీ పార్టీలను జనాలు మర్చిపోతారా అని మరో ప్రశ్న లేవనెత్తున్నారు.