బ్రేకింగ్ : వివేకా హత్య కేసులో మరోసారి సంచలనం.!

Wednesday, June 12th, 2019, 03:43:21 PM IST

సరిగ్గా ఎన్నికలకు ముందు ఇంకా కాస్త సమయం మిగిలి ఉంది అనగా అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత అలాగే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ కు చిన్నాన్న అయినటువంటి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యా ఘటన ఎంతటి సంచలనానికి దారి తీసిందో అందరికీ తెలుసు.ముందు గుండె పోటు అని ఆ తర్వాత ఆత్మ హత్య అని మళ్ళీ ఆఖరున హత్య అని అనేక రకాల అనుమానాల నడుమ ఈ కేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిందో అర్ధమే కాకుండా పోగా పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.జగన్ అంతటి వ్యక్తికి సంబంధిచిన వ్యక్తి యొక్క కేసులోనే ఇంకా పురోగతి కనిపించకపోవడం ఇంకా ఆశ్చర్యం గానే కనిపిస్తుంది.

ఇప్పుడు ఈ విషయాన్నే మళ్ళీ సోషల్ మీడియాలో ఇతర పార్టీల శ్రేణులు ఎత్తి చూపుతున్నారు.ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ శ్రేణులు మరియు మిగిలిన రెండు పార్టీల వారికి ఏదైనా అంశం పై వార్ నడిస్తే అది ఆఖరున వివేకా హత్య కేసు దగ్గరకి వచ్చి ఆగుతుంది.ఇప్పుడు ఎలాగో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనే కదా ఆయన్ని ఈ కేసును ప్రత్యేకంగా తీసుకొని పూర్తి విచారణ జరిపించి అసలు దోషులు ఎవరో బయట పెట్టండి అంటూ ప్రశ్నలు వేస్తూ మొత్తానికి మళ్ళీ వివేకా కేసును ఛేదిస్తారా లేదా అని పదే పదే ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో మళ్ళీ సంచలనంగా మార్చుతున్నారు.