అప్పుడంతా దాక్కున్న రాజశేఖర్ ఇప్పుడొచ్చారేంటి.?

Tuesday, November 12th, 2019, 04:36:48 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్న వివాదం ఏమిటో అందరికి తెలిసిందే.రాష్ట్రంలోని ఉన్న తెలుగు మీడియంను పూర్తిగా తీసేసి ఇంగ్లీష్ మీడియంనే పెట్టాలని ఇక నుంచి బడికెళ్లే పిల్లలు అంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు అని వైసీపీ చేసిన ప్రకటనలు సంచలనం రేపుతున్నాయి.అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇప్పుడు ఏపీ ప్రజల్లో భిన్నాభిప్రాయాలతో సహా మిశ్రమ స్పందన వస్తుంది.

అయితే ఇదిలా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంకు గాను టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ మద్దతు ఇచ్చారు.”జగన్ అద్భుత నిర్ణయం తీసుకున్నారని ఈ రోజుల్లో ఉద్యోగాలు సంపాదించడానికి ఇతరులతో మిళితం అవ్వడానికి ఆంగ్లం తప్పని సరి అని అన్నారు.అంతే కాకుండా మాతృభాష తెలుగును కూడా ఈ ఇంగ్లీష్ మీడియంలో తప్పకుండా ఉంటుందని భావిస్తున్నానని అన్నారు.”ఓవరాల్ గా మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయం ఒక మహా అద్భుతం అని దానికి తన మద్దతు ఉందని చెప్పారు.

దీనితో కింద కామెంట్స్ లో మాత్రం రాజశేఖర్ ను నెటిజన్స్ ఒక రేంజ్ లో సమాధానం ఇస్తున్నారు.ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం వచ్చారని మండిపడుతున్నారు.తెలంగాణాలో ఆర్టీసీ స్ట్రైక్ సమయంలో మరియు ఏపీలో ఇసుక కొరత సమయంలో ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం వచ్చారని అప్పుడు ఎక్కడకి పోయారు అంటూ నెటిజన్స్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.ఇప్పటికే వీరంటే ఏపీ ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయం ఉంది.వాటన్నిటి మీదా మాట్లాడకుండా సడన్ గా ఇలాంటి వాటిపై మాట్లాడితే ఇలాంటి రియాక్షన్లు కూడా వస్తుంటాయి.