అడ్డంగా బుక్కయ్యిన తెలుగు తమ్ములు..మాములుగా ట్రోల్ చెయ్యట్లేదుగా.!

Monday, June 3rd, 2019, 06:52:44 PM IST

మాములుగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు గోరంత చేస్తే కొండంత చేశామని చెప్పుకునే టాక్ అందరిలోనూ ఉంది.దానికి తోడు చాలా సందర్భాలలో చంద్రబాబు కూడా తన అతిని ప్రదర్శించి సోషల్ మీడియా ప్రజానీకం మరియు ఇతర పార్టీల శ్రేణుల దగ్గర నవ్వుల పాలు అయ్యిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా అలాంటి నవ్వొచ్చే సంఘటనే ట్విట్టర్ లో చోటు చేసుకుంది.

ట్విట్టర్ లో అన్ని పార్టీలకు ఉన్నట్టుగానే తెలుగుదేశం పార్టీకు కూడా ట్విట్టర్ హ్యాండిల్ ఉన్న సంగతి తెలిసిందే ఈ రోజు వారు పెట్టిన ట్వీట్ చూసి సోషల్ మీడియాలో ప్రజానీకం మాములుగా నవ్వుకోలేదు.ఈ సమయం ఆ ట్విట్టర్ అడ్మిన్ కు ఇంత అతి అవసరమా అంటూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే బాబును కలవడానికి గన్నవరం నుంచి ఒక కుటుంబం వచ్చారు.వారిపై పెట్టిన ట్వీట్ ఇలా ఉంది..

“కృష్ణాజిల్లా గన్నవరం నుంచి @ncbn ను కలిసేందుకు తన తల్లిదండ్రులతో వచ్చిన నాలుగేళ్ళ భానుశేఖర్, చంద్రబాబును చూడగానే.. తాను పెద్దయ్యేసరికి ఏపీ నెంబర్ వన్ కావాలని, ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని, ఇందుకు ఏం చేస్తారో మీ ఇష్టం అని అన్నాడు.” అని ఒక ట్వీట్ పైగా “రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పసిమనసుపై అంతటి ప్రభావాన్ని చూపించాయన్నమాట.” అంటూ మరో ట్వీట్ కూడా పెట్టారు.దీనితో సోషల్ మీడియా ప్రజానీకం ఓ రేంజ్ లో ఆడుకునే సరికి ఆ ట్వీట్ ను డిలీట్ చేసి మళ్ళీ దాన్నే సవరించి పెట్టారు.