అప్పుడే సాధినేని యామినీకు దిమ్మతిరిగే షాక్.!

Tuesday, August 20th, 2019, 12:09:35 PM IST

అసలు తెలుగుదేశం పార్టీను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడని నేతలుగా ఉన్నటువంటి వారే చాలా మంది ఆ పార్టీ ఎన్నికల ఓటమి తర్వాత చంద్రబాబుకు హ్యాండిచ్చారు.చంద్రబాబుపై ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడకుండా మెల్లగా ఇతర పార్టీలలోకి జారుకుంటున్నారు.ఎక్కువ శాతం టీడీపీ నేతలు అంతా బీజేపీలోకి వెళ్లిపోతున్నారు.ఇదిలా ఉండగా అసలు ఎవరు ఊహించని రీతిలో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆ పార్టీను వీడి బీజేపీలోకి చేరి ఆశ్చర్యపరిచింది.ఈమె తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతర పార్టీల అభిమానుల చేతుల్లో నవ్వులపాలయ్యేలా చేసింది.

ఆమె ఇంతకు మునుపు టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబుకు మరియు ఆ పార్టీకు చేసిన భజన అంతా ఇంతా కాదు.చంద్రబాబు మెప్పు పొందేందుకు ఎంతటి మాట అయినా సరే ఈమె వాడిసి ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.ఇదొక్కటేనా ఆమె మోడీపై మరియు కేంద్రంపై కూడా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయి విమర్శలు చేసారు.కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే బీజేపీ పార్టీలో చేరారు.దీనితో ఇక సోషల్ మీడియా ప్రజానీకం ఊరుకుంటారా?గతంలో ఈమె అన్న వీడియోలు బీజేపీ పై చేసిన మాటలు కేంద్రం ఏపీని మోసం చేసిందని తెలుగు తల్లి వేషధారణ చేసిన ఫోటోలు అన్ని తీసుకొచ్చి ఈమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వేస్తున్నారు.మొత్తానికి యామిని తీసుకున్న నిర్ణయం మాత్రం ఆమెకే పెద్ద షాకిచ్చింది.