అప్పుడు “అప్పడాలు” ఇప్పుడు “అద్దాలు”..మీ పబ్లిసిటీ తగలెయ్య!

Thursday, November 14th, 2019, 10:00:48 PM IST

ఏపీలోని ఉన్నటువంటి తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలను జనాలు త్వరగా మర్చిపోతారని అనుకుంటారో ఏమో కానీ వీళ్ళకున్నంత భయం వేరే ఏ పార్టీకు లేదని చెప్పాలి.ఆ భయం వల్లే ఏమో వీరి పిచ్చి పిచ్చి పబ్లిసిటీలతో సామాన్య ప్రజలకు చికాకు పుట్టిస్తున్నారు.గోరంత చేసినదానికి కొండంత చేసినట్టుగా గతంలో టీడీపీ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు దానినే పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వైసీపీ ఏమన్నా ఉద్ధరిస్తుందా అంటే వీరికన్నా ఒక ఆకు ఎక్కువే చదివి ఆఖరికి జాతీయ జెండా పైనే వారి పార్టీ జెండా రంగులను పూసేసారు.

ఎక్కడ చూసినా వీరి మొహాలే కనిపించాలి వీరి పార్టీ జెండాలే దర్శనం ఇవ్వాలి అన్నట్టుగా ఒకరిని మించి ఒక బిల్డప్ బాబాయ్ ల్లా తయారయ్యారు.అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కళాఖండం ఈ ఏడాది దర్శనం ఇచ్చింది.ఆ మధ్య మాములుగా తినే అప్పడాలపై కూడా చంద్రబాబు మొహం కనిపించడంతో వీరి పబ్లిసిటీ పరాకాష్టకు చేరిపోయిందని అనేక విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు ఇదే ఇలా ఉంటే ఈరోజు ఇంకో అద్భుతాన్ని చూసిన సోషల్ మీడియా ప్రజానీకం అయితే మీ పబ్లిసిటీ తగలెయ్య అని టీడీపీ మీటింగ్ ఫోటోను చూసి అంటున్నారు.ఈరోజు ఇసుక కొరత మీద చంద్రబాబు దీక్ష చేసిన సంగతి అందరికి తెలిసిందే.కానీ ఇదే దీక్షలో కొంతమంది ఆడవాళ్లు కొన్ని కళ్లద్దాలు పెట్టుకున్నారు.వాటిపై “జైజై చంద్రన్న” అని రాసి ఉంది ఇది చూసిన నెటిజన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెర్రెక్కిపోతున్నారు.ఇదేం పబ్లిసిటీ పిచ్చి అంటూ చీదరించుకుంటున్నారు.