జగన్ పై సెటైర్లు మాములుగా పడట్లేదుగా.!

Saturday, August 17th, 2019, 04:19:47 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇతర పార్టీల నేతలతో సహా సామాన్య ప్రజానీకం కూడా మండిపడుతున్నారు.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన మాటల మేడలకు ఆహా ఓహో అన్న వారంతా అసలు ఇప్పుడు జగన్ కు ఎందుకు ఓటేశామా అని చింతిస్తున్నారు.అయితే ఈ వాదన రావడానికి కూడా కారణాలు లేకపోలేవు.ఆ పార్టీకు చెందిన వారికి మాత్రమే ముందుగా సదుపాయాలు చిక్కడం,వారై సంబంధీకులు అనుచరులు మాత్రం బాగుపడుతున్నారు కానీ జగన్ వస్తే న్యాయం జరుగుతుందని నమ్మిన వారికి మాత్రం న్యాయం జరగడం లేదు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి.కానీ ఇప్పుడు మళ్ళీ జగన్ వ్యవహార శైలిని చూసి మరింత మండిపడుతున్నారు.ఇక్కడ జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు వల్ల రాష్ట్ర ప్రజలు మునిగిపోతుంటే ఈయన మాత్రం విహారయాత్రలు చేస్తున్నారని ఆయన బయలుదేరినప్పటికే ఇక్కడ వరదలు రాలేదా?ఈయన వెళ్ళిపోతే ఈయన నియమించిన ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి జగన్ మీద అయితే ఇప్పుడు మెల్లమెల్లగా వ్యతిరేఖత మొదలవుతుందనే చెప్పాలి.