కేటీఆర్ ని ప్రశ్నిస్తున్న నెటిజన్లు…వారి ఫై కేసు నమోదయ్యిందా?

Friday, February 7th, 2020, 05:09:30 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వలన త్వరితంగా న్యాయం జరుగుతుంది అని, అయితే దీనికి సంబంధించి కేటీఆర్ హోంశాఖ, మరియు న్యాయశాఖ కి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ ని పెట్టారు. తెలంగాణ లో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలు, చిన్నారులకు సంబందించిన మూడు దారుణ కేసుల్లో ఆరు నెలల లోపే తీర్పుని ఇచ్చేసాయి అని కేటీఆర్ అన్నారు. ఆయా కేసులకు సంబంధించి ఐదుగురికి ఉరి శిక్ష విధించారు అంటూ తెలియజేసారు. ఈ కేసుల విషయం లో సత్వర న్యాయం జరిగేలా కృషి చేసినందుకు గానూ, న్యాయ, హోంశాఖ అధికారులతో పాటుగా న్యాయ వ్యవస్థ ని అభినందించారు కేసీఆర్.

అయితే కేసీఆర్ చేసిన పోస్ట్ కి గానూ కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. సైబర్ టవర్స్ వద్ద ఉన్నటువంటి బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ఫై నుండి కారు మీద పడి ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అలా తన మరణానికి కారణమైన వ్యక్తి ని కూడా విడిచిపెట్టకండి కేటీఆర్ గారు అంటూ ఒకతను కామెంట్ చేయగా, అసలు దాని ఫై కేసు నమోదయిందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.