99 ఎక‌రాలు న‌కిలీ రిజిస్ట్రేష‌న్! 25,000 కోట్లు ఎగ‌వేత‌!!

Saturday, September 17th, 2016, 01:53:14 PM IST

GEETHA
రాజ‌కీయ వ‌ర్గాల్లో అనూహ్యంగా క‌ల‌క‌లం. ఓ మ‌హిళా ఎంపీ ఏకంగా 99 ఎక‌రాలు న‌కిలీ రిజిస్ట్రేష‌న్ చేయించ‌డ‌మే కాకుండా.. ఆ భూమిపై బ్యాంకుల నుంచి ఏకంగా 25000 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్ట‌డం హాట్ టాపిక్ అయ్యింది.
ఇదంతా కాస్త ఆల‌స్యంగా వెలుగు చూడ‌డంతో వాడి వేడిగా ఈ అంశంపై చ‌ర్చ సాగుతోంది.
డీటెయిల్స్‌లోకి వెళితే .. ఇటీవ‌లే అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత కు తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఇటీవ‌ల వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో త‌న భూమిని ఓ టీ-మంత్రి కబ్జా చేశాడ‌ని గీత ఆరోపించారు. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టేందుకేమో గీత‌కు సంబంధించిన ఓ స్కామ్‌ని త‌వ్వి తీశారు. గీత డిప్యూటీ క‌లెక్ట‌ర్ గా ప‌నిచేసే స‌మ‌యంలో హైద‌రాబాద్ – శేరులింగంప‌ల్లి మండ‌లం రాయ్ దుర్గం పాన్ ముక్తాలో పాత ముంబై హైవేకు అనుకుని ఉన్న 99 ఎక‌రాల భూమిని త‌న భ‌ర్త పేర రాత్రికి రాత్రి న‌కిలీ రిజిస్ట్రేష‌న్ చేయించారుట‌.

ఆ భూమి హామీ చూపించి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో 25 వేల కోట్లు రుణం తీసుకున్నారని, అది తిరిగి చెల్లించ‌కుండా గీత ఎగ్గొట్టార‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. గీత‌పై విచార‌ణ‌కు స‌ద‌రు బ్యాంక్ కోర్టులో అప్పీల్ చేసిందిట‌. మొత్తానికి టీ-గ‌వ‌ర్న‌మెంటుతో పెట్టుకున్న గీత‌కు ముప్పు తిప్ప‌లు త‌ప్పేట్టు లేవ‌నే అంటున్నారు.