ఎన్టీఆర్ బయోపిక్ లిస్ట్ లో మరో దర్శకుడి పేరు ?

Thursday, May 3rd, 2018, 09:56:48 AM IST

నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్క నున్న బయోపిక్ విషయంలో కథ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ సినిమా నుండి దర్శకుడు తేజ బయటికి రావడంతో ఇప్పుడు ఆ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారా అన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఈ సినిమా పూర్తవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ బాలయ్య మాత్రం ఎలాగైనా సరే ఈ సినిమాను పూర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక దర్శకుల విషయంలో ఇప్పటికే రాఘవేంద్ర రావు , క్రిష్ ల పేర్లు వినిపించాయి .. కానీ వారు వేరే పనులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దాంతో బాలయ్యే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో దర్శకుడి పేరు వినిపిస్తుంది. అయన ఎవరో కాదు ఆ నలుగురు, అందరి బంధువయా, ఏమో గుర్రం ఎగరావచ్చు లాంటి సినిమాలు తీసిన చంద్ర సిద్దార్థ్ ? చంద్ర సిద్దార్థ్ పర్యవేక్షణలో బాలయ్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే చంద్ర సిద్దార్థ్ తో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ప్రసుతం చంద్ర సిద్దార్థ్ ఆటగదరా శివా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి చంద్ర సిద్దార్థ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఎస్ అంటాడా .. లేదా అన్నది తేలాల్సి ఉంది.