మీరెక్కడున్నారో వాట్సాప్ చెప్పేస్తుంది..!

Sunday, January 29th, 2017, 03:20:03 PM IST

whatsap
వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్ లను జత చేస్తూ ఆ సంస్థ వినియోగ దారులను ఆకర్షిస్తోంది.ఇప్పటికే వీడియో కాలింగ్, జిప్ షేరింగ్ వంటి విన్నూత్న ఫీచర్ లతో వినియోగదారులను ఆకట్టుకున్న వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ ని జత చేయడానికి సిద్ధమవుతోంది.లైవ్ లొకేషన్ ఫీచర్ ని త్వరలో తీసుకునిని రానున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.

ఈ ఫీచర్ ద్వారా మీరు ఎక్కడున్నది మీ స్నేహితులు తెలుసుకోవచ్చు. దీనికోసం షో మై ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ని చేర్చనున్నారు. దీనిద్వారా గ్రూప్ లో మిగిలిన వారు ఎక్కడున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. దీనితో పాటు మన లొకేషన్ వివరాలు ఇతరులకు ఎంత సమయం కనిపించాలనే విషయం కూడా సెట్ చేసుకోవచ్చు. స్నేహితులంతా వేరువేరు చోట్ల ఉంచి ఓ చోటికి చేరుకునే సమయం లో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.