తెలంగాణలో హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్

Thursday, October 16th, 2014, 06:08:04 PM IST

high-court
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చెయ్యడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు సుముఖతను వ్యక్తం చేశారు. కాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం చర్చలు జరిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టుకు చీఫ్ జస్టిస్ ససిద్ధతను వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే తెలంగాణ హైకోర్టును కింగ్ కోఠిలోని నిజాం పరదా ప్యాలెస్ లో లేదా ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవనంలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కాగా రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ రెండు భవనాలను పరిశీలించినట్లు సమాచారం.