4 టీబీ మెమొరీ స్టోరేజ్ చూసారా… లెనోవో ఫోన్ అంట

Saturday, May 19th, 2018, 01:19:34 AM IST

ఇప్పటివరకూ 256 జీబీ వరకు వచ్చిన యాపిల్ ఐ ఫోన్ మాత్రమె చూశాం. కానీ ఇప్పుడు అంతకు మించి…ఏంటా అనుకుంటున్నారా..? ఫోన్ అండీ అవును ప్రముఖ లెనోవో సంస్థ త్వరలోనే 4 టీబీ స్టోరేజ్ కలిగిన కొత్త ఆండ్రయిడ్ ఫోన్ ను విడుదల చేయనుంది. ఇది అక్షరాలా సత్యం. ఈ విషయాన్ని లెనోవో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చినీస్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లో తెలియజేశారు. ఈ ఫోన్ కు సంబందించిన డిజైన్ కూడా ఆ సైట్ లో విడుదల చేశారు. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ లో 2000 హెచ్డీ సినిమాలు, 10,000 ఫోటోలను, 1,50,000 ల లూస్ లెస్ పాటలను నిమ్పుకునేంట సామర్థ్యం కలిగి ఉంటుందట. అధికారికంగా ఈ ఫోన్ ని లెనోవో జెడ్ 5 గా దృవీకరణ చేయగా ఈ ఫోన్ ను ముందుగా చినా లో లాంచ్ చేయనున్నారు. తర్వాత ఇండియాకు తీసుకురానున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఫోన్ వెనుక వైపు కూడా స్క్రీన్ లాంటి ఎలక్ట్రానిక్ డిస్ప్లే ని అమర్చారు.

  •  
  •  
  •  
  •  

Comments