అజ్ఞాతవాసి తో తెరపైకి కొత్త ప్లాన్ లు!

Thursday, January 11th, 2018, 12:55:40 PM IST


అజ్ఞాతవాసి సినిమాలోని డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. చిత్రంలో కీలక పాయింట్ అయిన ప్లాన్-ఎ వర్కౌట్ కాకపోతే ప్లాన్-బి ని అమలుచేస్తారన్నమాట. ఈ డైలాగు ని ఇప్పుడు నెటిజెన్స్ ట్రెండ్ చేస్తున్నారు, కాకపోతే రివెర్స్ గేర్ లో. అజ్ఞాతవాసిని ప్లాన్-ఎ గా చెప్తున్న ప్రేక్షకులు దయచేసి ప్లాన్-బి ని సెలెక్ట్ చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇందులో మరొక డైలాగే కూడా వుంది. కొత్త ఐడియా రాకపోతే పాత ఐడియా నే ఫాలో అయిపోదం అని పవన్ అంటారు, దీనిని కూడా వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే పాత ఐడియాలతో తెరకెక్కిన అజ్ఞాతవాసిని చూసి టైం, డబ్బులు వృధా చేసుకునే బదులు పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన అత్తారింటికి దారేది నే మరొక్క సారి యూట్యూబ్ లో చూడండి అని సలహాలిస్తున్నారు. ఒక గమ్మత్తయిన విషయం ఏంటంటే ఈ అంశాన్ని బాలయ్య ఫాన్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్లాన్-ఎ అంటే అజ్ఞాతవాసి, ప్లాన్-బి అంటే బాలయ్య అని వారి ఉద్దేశం. దీని ప్రకారం ప్లాన్-ఎ పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి, ప్లాన్-బి ని అమలుచేద్దాం, అంటే బాలయ్య నూతన చిత్రం జైసింహ చిత్రాన్ని చూద్దాం అని వారు ట్రెండ్ చేస్తున్నారు..