ఉగాది పండుగ సందర్భంగా సరికొత్త పోస్టర్ ను విడుదల చేసిన “ఆర్ఆర్ఆర్” టీమ్

Tuesday, April 13th, 2021, 11:37:17 AM IST

ఉగాది పండుగ పురస్కరించుకొని రౌద్రం రణం రుధిరం చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ కూడా ఈ పోస్టర్ లో సూపర్ అనేలా ఉన్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అయితే పండుగ సందర్భంగా పలు సినిమాలకు సంబందించి పోస్టర్లు విడుదల అయ్యాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ టీమ్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిత్రం అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.