ఏపీలో వైద్య విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీ.. త్వరలో నోటిఫికేషన్..!

Sunday, May 24th, 2020, 01:44:05 AM IST

ఏపీలో వైద్య విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో వైద్య విభాగాన్ని ముందుగానే పటిష్టం చేయనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు.

అయితే 9,700 డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే రానున్నట్టు తెలుస్తుంది.