2019 ఎన్నిక‌ల్లో గెలిస్తేనే కొత్త స‌చివాల‌యం?

Wednesday, November 30th, 2016, 06:41:52 PM IST

kcrr
కేసీఆర్ ఇటీవ‌లే కొత్తింట్లోకి దిగిన సంగ‌తి తెలిసిందే. అధునాత‌న సాంకేతిక‌త‌తో నిర్మించిన ఈ భ‌వంతి బ‌డ్జెట్ గురించి విప‌క్షాల‌న్నీ బోలెడంత ర‌చ్చ చేశాయి. అయితే అంత‌కుమించి.. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పించేలా.. అమెరికా ఫెడ‌ర‌ల్ భవంతుల్ని కొట్టేలా తెలంగాణ స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒకే ఒక్క పంచ్‌తో మోదీ ఆ నిర్ణ‌యాన్ని ప‌టాపంచ‌లు చేయ‌గ‌లిగార‌ని ఇటీవ‌ల చెప్పుకుంటున్నారు. పెద్ద నోటు పంచ్‌తో ఇప్ప‌ట్ల‌లో ఈ ప్రాజెక్టు పూర్త‌వ్వ‌ద‌ని సీఎం కేసీఆర్ చేతులెత్తేశార‌ని అంటున్నారు.

అయితే మ‌రి కొత్త స‌చివాల‌యం ఇక లేన‌ట్టేనా? ఉంటే ఎప్పుడు నిర్మాణం మొద‌ల‌వుతుంది? అన్న‌దానికి సీఎంకి అత్యంత స‌న్నిహితుల ద్వారా తెలిసిన విష‌య‌మిది. ఇప్ప‌ట్లో ఆదాయ మార్గాల‌న్నీ కుంచించుకుపోయిన‌ట్టే. బొక్క‌సానికి భారీగా బొక్క ప‌డింది. కాబ‌ట్టి ఇలాంటి స‌న్నివేశంలో 300 కోట్ల ఖ‌ర్చుతో స‌చివాల‌యం నిర్మిస్తే అది ప్ర‌జ‌ల్లో నెగెటివ్ భావ‌న‌ను పాతుకువెళుతుంది. దానివ‌ల్ల పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో పెను ప్ర‌మాదం ముంచుకొస్తుంది. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేవార‌కూ సంయ‌మ‌నం పాటిద్దామ‌ని కేసీఆర్ అన్నారుట‌. ఒక‌వేళ ఈ నిర్మాణం ఇప్పుడే చేప‌ట్టాల‌నుకుంటే ప్ర‌తిప‌క్షాలు, విపక్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌వార‌మ‌వుతామ‌ని ఆయ‌న భావిస్తున్నారుట‌. అందుకే ఇక కొత్త భ‌వంతుల నిర్మాణం ఇప్ప‌ట్లో లేన‌ట్టే. ఏదైనా 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాతే.. ప్చ్‌!!