ఆ సెంటిమెంట్ వద్దంటున్న ఎన్టీఆర్ ఫాన్స్ ?

Wednesday, May 16th, 2018, 02:35:37 AM IST

సినిమా రంగంలో ప్రతి పనికి సెంటిమెంట్ చూస్తారు. ఇక్కడ సెంటిమెంట్ లేనిదే ఏ పని వర్కవుట్ కాదు. ఆ విషయం గురించి ఎందుకంటే .. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఈ సెంటిమెంట్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. తాజాగా ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ పై పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ పెడుతున్నట్టు తెగ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాకు ఆ అక్షరంతో టైటిల్ పెట్టొద్దని అయన ఫాన్స్ పట్టుపడుతున్నారట. ఎందుకంటే ఇదివరకే ఎన్టీఆర్ నటించిన అశోక్ భారీ పరాజయాన్ని అందుకుంది. పైగా లేటెస్ట్ గా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి రిజల్ట్ కూడా అలాగే ఉండడంతో ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్ సినిమాకు వద్దని ఫాన్స్ చెబుతున్నారట. దాంతో ఈ టీమ్ మరో టైటిల్ ఆలోచనలో పడింది . అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారన్న విషయం పై క్లారిటీ రావాలంటే ఈ నెల 20 దాకా ఆగాల్సిందే .. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments