న్యూ సాంగ్ : ఐ డోంట్ నో (భరత్ అనే నేను)

Sunday, April 1st, 2018, 10:23:37 AM IST

సూపెర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఎమ్ ఎస్ ధోని మూవీ ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా భరత్ అనే నేను. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ఫస్ట్ ఓత్, విజన్ అఫ్ భరత్ అలానే ది సాంగ్ అఫ్ భరత్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా ఎన్నో సంచలనాలు సృష్టించాయి. అయితే ప్రస్తుతం నేడు ఈ సినిమాలోని రెండవ పాత అయినా ఐ డోంట్ నో అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తొలిసారి తెలుగు లో పాడిన పాట ఇది. ఈ పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. ట్యూన్ చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉండడంతో విన్న వెంటనే చాలా డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. అలా విడుదలయిందో లేదో ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గ మారింది. పాట విన్న మహేష్ బాబు అభిమానులు దేవి శ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సూపర్బ్ గా ఉందని కితాబిస్తున్నారు. అయితే మీరు కూడా ఈ పాట ఓ సారి వినేయండి మరి….

  •  
  •  
  •  
  •  

Comments