ఎన్టీఆర్ కోసం మరో కొత్త టైటిల్ ?

Saturday, May 19th, 2018, 02:28:19 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్నా విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుందంటూ పాటు టైటిల్ విషయంలో పలు మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అసామాన్యుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది .. ఈ టైటిల్ పై ఎన్టీఆర్ ఫాన్స్ నెగిటివ్ గా ఉండడంతో మరో టైటిల్ కోసం అన్వేషణ సాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది .. ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. రా.. రా కుమారా ? ఈ టైటిల్ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. మరి టైటిల్ పెడతారా లేదా అన్న విషయం తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే .. ఎందుకంటే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా 19న సాయంత్రం మొదటి లుక్ ని విడుదల చేయనున్నారు. సో మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫాన్స్. ఈ సినిమాకోసం తన ఫిజిక్ ను కూడా మార్చేసిన ఎన్టీఆర్ న్యూ లుక్ ఎలా ఉంటుందో అన్న క్రేజ్ ఎక్కువైంది.

  •  
  •  
  •  
  •  

Comments