ఎన్టీఆర్.. అరవింద సమేత రాఘవ ?

Saturday, May 19th, 2018, 02:19:48 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ నేటి సాయంత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడుతున్నారా అన్న ఆసక్తి ఎక్కువైంది. ముక్యంగా అసామాన్యుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఆ టైటిల్ పై ఎన్టీఆర్ ఫాన్స్ నెగిటివ్ గా ఉండడంతో మరో టైటిల్ ని అన్వేషించే పనిలో పడ్డారు .. ఈ నేపథ్యంలో తాజాగా రారా కుమారా అనే టైటిల్ వెలుగులోకి వచ్చింది .. లేటెస్ట్ గా సినిమా యూనిట్ నుండి ఇంకో టైటిల్ లీక్ అయినట్టు తెలుస్తోంది .. ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. అరవింద సమేత రాఘవ ? అని టాక్ ? దాదాపు ఇదే టైటిల్ ని పెడతారంటూ జోరుగా ప్రచారం కూడా జరుగుతున్నా నేపథ్యంలో ఈ టైటిల్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఏది నిజం అన్నది తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments