దసరా కి కొత్త రైళ్ళు , ప్రత్యేక రూట్ లు

Friday, September 30th, 2016, 03:10:37 PM IST

train
దసరా రోజుల్లో ప్రయాణీకులు ఎక్కువగా కాలం లో ప్రజలు రైళ్ళు టైం కి రాక, ఒచ్చినా ఖాళీ లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. జనం ఎక్కువ రైళ్ళు తక్కువ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా రైల్వే శాఖ ఇప్పుడు దసరా సీజన్ కి సరిపడా రైళ్ళు ప్రకటించింది. వీటిల్లో సికిందరాబాద్ – కాకినాడ మధ్యనే 10 రైళ్ళ వరకూ స్పెషల్ గా తిరుగుతాయి ఈ పది రోజుల్లో.

రైలు నెంబర్ 07011 : సికిందరాబాద్ – కాకినాడ మధ్యన స్పెషల్ , అక్టోబరు 4, 11, 18, 25వ తేదీల్లో, నవంబరు 1వ తేదీన ఈ రైలు రాత్రి గంటలు 7:15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం గంటలు 5:45కు కాకినాడ పోర్టు చేరుకుంటుంది.

రైలు నెంబర్ 02793 : సికింద్రాబాద్ – పాట్నా స్పెషల్ ని సువిధ స్పెషల్ గా అక్టోబర్ 28 వరకూ నడుపుతున్నారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి అక్టోబరు 28న ఉదయం గంటలు 8:35కు బయలుదేరి శనివారం సాయంత్రం గంటలు 4:10కి పట్నా చేరుకుంటుంది.

దసరా దీపావళి పండుగల ని దృష్టిలో పెట్టుకునన్ రైల్వే శాఖ హైదరాబాద్ – దుర్గాపూర్ మధ్యన 14 రైళ్ళని జైపూర్ వరకూ పొడిగించారు.

  •  
  •  
  •  
  •  

Comments