అమీన్‌పూర్ రేప్ కేసులో కీలక ట్విస్ట్.. అసలు నిజాన్ని భయటపెట్టిన పోలీసులు..!

Friday, January 24th, 2020, 07:38:02 PM IST

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో రెండు రోజుల క్రితం మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని వార్తలు వినిపించాయి. తనను ముగ్గురు యుకకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశారని బాలిక తల్లితండ్రులకు చెప్పడంతో తల్లితండ్రులు వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు భయటపడ్డాయి.

అయితే ఆ బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, స్థానికంగా ఉండే సందీప్ అనే యువకుడితో కలిసి ఆ బాలిక సినిమాకి వెళ్ళిందని ఇంట్లో తల్లితండ్రులకు తెలిస్తే తిడతారన్న భయంతో అలా తనపై అత్యాచారం జరిగినట్టు చెప్పిందని, అంతేకాకుండా ఆ బాలికకు వైద్య పరిక్షలు నిర్వహించగా ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని తేలిందని, ఇదంతా విచారణలో ఆ బాలిక ఒప్పుకున్నట్టు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి నిజాన్ని భయటపెట్టారు. ఆ బాలిక ఆ యువకుడితో కలిసి బైక్‌పై వెళ్ళిన ఫోటోలను కూడా సీసీటీవీ ఆధారంగా గుర్తుంచి భయటపెట్టారు. అయితే ఆ బాలికను సినిమాకు తీసుకెళ్లి అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సందీప్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, అంతేకాదు దీనిపై తప్పుడు ప్రచారం చేసిన ఆ బాలిక ఇంటి యజమానిపై, తల్లి తండ్రులపై కూడా కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.