బ్రేకింగ్: జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌లో మరో కొత్త ట్విస్ట్..!

Tuesday, August 13th, 2019, 06:35:43 PM IST

ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందా అంటే అది తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక కావడంతో అందరి చూపు ఆయన వైపే ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ గురుంచి, వైసీపీ పాలన గురుంచి గొప్పగా ప్రసంగాలు చెప్పడంతో రాపాక కూడా వైసీపీలో చేరిపోతారని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను ఖండించిన రాపాకా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, జనసేనలోనే కొనసాగుతానని చెప్పారు.

అయితే తాజాగా రాపాక, అతడి అనుచరులు మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారని పోలీసులు రాపాకపై మరియు అతడి అనుచరులపై కేసు నమోదు చేసారు. అయితే ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో రాపాక స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే రాపాకను పోలీసులు కోర్ట్‌లో హాజరుపరిచారు. అయితే కోర్ట్ మాత్రం పోలీసులను మందలించి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసే విధానం ఇది కాదని, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విజయవాడలోని ప్రత్యేక కోర్ట్‌కు వెళ్ళాలని సూచించింది. అంతేకాదు రాపాకకు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించిది. అయితే పోలీసులు రాపాకకు స్టేషన్ బెయిల్ మంజూర్ చేసి విడుదల చేసారు.