కోడెల కేసులో మరో కొత్త ట్విస్ట్.. హైకోర్ట్‌లో పిటీషన్..!

Friday, September 20th, 2019, 05:33:46 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీ రాజకీయాలలో పెద్ద దుమారం రేపింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కోడెలను చిత్ర హింస పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసారని టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే వైసీపీ టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు పార్టీలో పట్టించుకోకపోవడం వలనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తుంది.

అయితే కోడెల ఆత్మహత్య ఘటనపై తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడెల మృతి పై అనుమానాలున్నాయని అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి సీబీఐ విచారణ కోరుతూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అన్నతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కోడెల నివాసంలో బాంబులు పేలినా కూడా కోడెల ఆత్మహత్యకు పాల్పడలేదని, డాక్టర్‌గా ఉన్న కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు కోడెల మృతికి సంబంధించి పెద్ద మిస్టరీ నడిచిందని ఆయన ఆత్మహత్య వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు కనిపెట్టాలని, కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు రాజకీయ కుట్ర ఉందని చంద్రబాబును, కోడెల కుమారుడు శివరాంను విచారిస్తే వాస్తవాలు భయటపడతాయని చెప్పుకొచ్చారు.