మెగాస్టార్ సైరా గురించి మరో అప్ డేట్ !!

Thursday, November 9th, 2017, 11:17:04 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి సినిమా డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో హాట్ న్యూస్ తెలిసింది, అదేమిటంటే కర్నూల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా 1846 నేపథ్యంలో బ్రిటిష్ వారితో జరిపిన పోరాటం బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. దానికోసం అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా హైద్రాబాద్ లో భారీ సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకం పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ రచన అందిస్తుండగా, మరో రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేస్తారట. ఇప్పటికే నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments