స్పీడ్ అందుకున్న రాజమౌళి మల్టి స్టారర్ ?

Monday, October 8th, 2018, 01:34:44 PM IST

బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా మల్టి స్టారర్ ట్రిపుల్ ఆర్ . ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ తాజా మల్టి స్టారర్ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి . తాజగా నిన్న టెక్నీకల్ టీమ్ తో మీటింగ్ జరిగిందట. ఈ సినిమా పై ఎలాగూ భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి .. దానిని మించేలా సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో పాటు నవంబర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు వర్క్ షాప్ లో పాల్గొంటారట . డిసెంబర్ చివరలో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారట .. ఈ సినిమాను స్పీడ్ గానే పూర్తీ చేసి 2020 సంక్రాంతికి విడుదల చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ? దీనికి సంబందించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే .. ఇందులో చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరు అన్నదమ్ములుగా కనిపిస్తారట … బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు . భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్ డేట్ దసరా రోజున వచ్చే అవకాశం ఉంది .