పెళ్ళికి ఐదొందల మంది కంటే ఎక్కువ రాకూడదు

Wednesday, February 22nd, 2017, 12:56:20 PM IST


పెళ్లిని జీవితం లో అందరూ ఒక మధురానుభూతిగా చూస్తారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కోటానుకోట్లు ఖర్చు పెట్టి వేలాది మంది సాక్షిగా తమ దర్జా దర్పం చూపిస్తూ ఉంటారు పెళ్ళిలలో జనాలు. కానీ మధ్యతరగతి వారికి మాత్రం పెళ్లి పెను భారం అనే చెప్పాలి. పెళ్లి టైం లో కూడా కష్టాలు చవి చూసి అప్పు చేసి బతికేవాళ్ళు ఎందఱో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఇప్పుడు కొత్తః చట్టం తీసుకుని వచ్చింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త పెళ్లిళ్ల చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా తయారు చేసిన చట్టం ప్రకారం.. పెళ్లికి అనవసరమైన హంగామా చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. జమ్ముకశ్శీర్ రాష్ట్రంలోజరిగే పెళ్లి విషయంలో అనేక ఆంక్షలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.