పెళ్లయిన 16 రోజులకే భార్య గొంతు కోసి..!

Sunday, January 22nd, 2017, 02:08:34 PM IST

new-mrg
ప్రేమించి వివాహం చేసుకున్న అతడు తన భార్యని 16 రోజులకే కడతేర్చిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం కు చెందిన రేణుక, కూసుమంచి మండలం కు చెందిన వెంకన్న 16 రోజుల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ నెల 11 వారు ఖమ్మం లో ఓ అద్దె ఇల్లు తీసుకుని అందులో కాపురం పెట్టారు. రేణుకకు అంతకు ముందే ఓ వ్యక్తి తో వివాహమై అతడితో విడిపోయింది. ఆతరువాత ఆమె వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకన్న ని ప్రేమించి వివాహం చేసుకుంది.

కాగా శనివారం రేణుక తల్లి ఫోన్ చేయగా రేణుక ఎత్తలేదు. దీనితో అనుమానం వచ్చిన తల్లి సాయంత్రం ఐదు గంటల ప్రాంతం లో ఆమె ఇంటికి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది.దీనితో ఇరుగు పొరుగువారికి అడగగా వెంకన్న ఉదయం 10 గంటలకు తాళం వేసి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. దీనితో తాళం పగలగొట్టి చూడగా రేణుక అప్పటికే రక్తపు మడుగులో పడిఉంది. అతిదారుణంగా ఆమెని వెంకన్న హత్య చేసినట్లు అర్థం అయింది. అతడు రేణుకాని కూరగాయలు కోసే కత్తితో చంపినట్లు తెలుస్తోంది. రక్తపు మరకలను బాత్ రూమ్ లో శుభ్రం చేసుకున్నట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయ్. ఘటనాస్థలానికి డిఎస్పీ సురేష్ కుమార్ చేరుకొని విచారణ చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.