అవిశ్వాసానికి సిద్దమన్న సునీతా లక్ష్మారెడ్డి

Sunday, June 9th, 2013, 05:15:53 PM IST

ప్రస్తుతం ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. దానికి తోడు కళంకిత మంత్రుల్ని కొందరిని తీసేస్తే మరో వైపు కొంతమంది మంత్రులను పార్టీయే బర్తరఫ్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ కి చెందిన 9 మందిని ఎమ్మెల్యేల పై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హ వేటు వేశారు. దీంతో రాష్ట్ర ఆధికార పార్టీ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీన్ని అదునుగా చేసుకొని ప్రతిపక్ష పార్టీలు రేపటి నుంచి మొదలుకాబోయే శాసనసభ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇదే విషయాన్ని అధికార పార్టీ మినిస్టర్ సునీతా లక్ష్మా రెడ్డి ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసం పెట్టినా ఎదుర్కునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉందని తెలిపింది. ఈ రోజు పాతబస్తీలో జరిగిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సునీతా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ‘ రేపటి నుంచి ప్రారంభం కాబోయే శాసనసభ సమావేశాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాము. అలాగే అవిశ్వాసం పెట్టినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని’ ఆమె తెలిపింది.