కాకినాడ మేయ‌ర్‌గా ప‌త్రికాధిప‌తి?

Saturday, November 5th, 2016, 04:23:55 PM IST

man-shado
ఏపీలో ప్ర‌ధాన న‌గ‌రాలకు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. స‌ముద్ర తీరంలో ఉన్న ఎమ‌ర్జింగ్ సిటీ కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇదే సంద‌ర్భంగా ఓ ప‌త్రికాధిప‌తి కాకినాడ మేయ‌ర్ ప‌ద‌విపై క‌న్నేశార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం వైకాపాలో కొన‌సాగుతున్న సద‌రు పొలిటీషియ‌న్‌కి ఓ సొంత‌ దిన‌ప‌త్రిక కూడా ఉంది. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగినా ఇటీవలి కాలంలో ఆ ప‌త్రిక రేంజు ప‌డిపోయింది. స‌ద‌రు వైకాపా నేత‌కు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న‌యుడిని బ‌రిలో దించాల‌న్న ప్లాన్ ఉంది. వైకాపా త‌ర‌పున పోటీ చేయించాల‌ని పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ చెవిలో ఎంత పోరుతున్నా.. పెద్దాయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదుట‌. దాంతో ప్లేటు ఫిరాయించి .. త‌న సొంత ప‌త్రిక‌లో తేదేపా అనుకూల వార్త‌లు రాయించ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కొచ్చింది. అస‌లింత‌కీ ఈ ఎపిసోడ్‌లో అస‌లు పేర్లేమి? అని ప్ర‌శ్నిస్తే.. మేయ‌ర్ అభ్య‌ర్థి `ఆంధ్ర‌ప్ర‌భ` అధినేత ముత్తా గోపాల కృష్ణ త‌న‌యుడు ముత్తా గౌత‌మ్‌. ఇప్పుడు వీడిందా చిక్కుముడి?