ఎన్‌హెచ్ 10 సినిమాకి కాపీ సినిమానా?

Sunday, September 9th, 2018, 03:54:23 PM IST

ఆత్మ‌, ప్రేతాత్మ‌, దెయ్యo, భూతం .. ఇవ‌న్నీ మీరు న‌మ్ముతారా? అనాదిగా పెద్దాళ్లు అల‌వాటు చేసిన ఆత్మ‌ల క‌థ‌లివి. వీటి విష‌యంలో కొంద‌రికి న‌మ్మ‌కం ఉంటుంది. మ‌రికొంద‌రికి ఎలాంటి న‌మ్మ‌కం, భ‌యం ఉండ‌వు. న‌మ్మితేనే భ‌యం. న‌మ్మ‌క‌పోతే ఏదీ ఉండ‌దు. అయితే ఒక్కోసారి దెయ్య ం లేదు అన్న వాళ్లే ఉందిరా బాబూ.. చూసి ఝ‌డుసుకున్నా! అని చెప్పిన సంద‌ర్భాలున్నాయి. ఈ అనంత సృష్టిలో మ‌నిషి ఎంత నిజ‌మో, దేవుడు ఎంత నిజ‌మో.. దెయ్య ం కూడా అంతే నిజ‌మేన‌ని న‌మ్మాల్సొస్తోంది. అలా న‌మ్మే వారిని భ‌య‌పెట్టేందుకు వ‌స్తోంది మ‌రో ప్రేతాత్మ‌. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఫార్మాట్‌లో తెర‌కెక్కిన యూట‌ర్న్ ట్రైల‌ర్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత స‌మంత న‌టించిన మ‌రో ఆస‌క్తిక‌ర చిత్ర‌మిది. సెన్సార్ యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించారు. ట్రైల‌ర్ కోటి వ్యూస్ దిశ‌గా దూసుకుపోతోంది. ఈ చిత్రం ఒకేసారి తెలుగు, త‌మిళ్ లో రిలీజ్ చేయ‌డం విశేషం. రాహుల్ ర‌వీంద్ర‌న్, భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అనుష్క శ‌ర్మ ఎన్‌హెచ్ 10 స్ఫూర్తితో తెర‌కెక్కించిన‌ద‌ని ట్రైల‌ర్లు చెబుతున్నాయి. చూద్దాం.. సామ్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా ఏమాత్రం విజ‌యం అందుకోనుందో?

  •  
  •  
  •  
  •  

Comments