శ్రీ రెడ్డికి గుడ్ న్యూస్ : చివరికి గెలుపు తనదేనా..?

Thursday, April 12th, 2018, 06:22:01 PM IST

తాజా సంచ‌ల‌నం శ్రీరెడ్డి రోజుకో మ్యాట‌ర్ లీక్ చేస్తూ టాలీవుడ్‌లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసి.. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి అందరి జాతకాలను బయటపెడతానంటూ.. మీడియా లైవ్‌కి ఎక్కిన ఈ శ్రీరెడ్డి తన వద్ద ఉన్న ఫోటోలను బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇక అసలు మ్యాట‌ర్ లోకి వెళితే శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి కొందరు మద్దతుగా నిలబడగా.. మరికొందరు ఆమె చేసిందాన్ని తప్పు బడుతూ సోష‌ల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ నేప‌ధ్యంలో శ్రీరెడ్డి చేస్తున్న‌ పోరాటానికి ఎవ‌రూ ఊహించని విధంగా ఆమెకు మద్దతు లభించింది. శ్రీరెడ్డిని సినిమాల్లో నటించకుండా.. మా అసోసియేష‌న్ ఆమె పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించార‌ని భావించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా శ్రీరెడ్డి ఆరోపణలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై.. తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇష్యూ చేసింది. ఇక ఫైన‌ల్‌గా సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం… శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది. దీంతో శ్రీరెడ్డి హెఆర్సీ గుడ్ న్యూస్‌ని అందించిందని.. కొంద‌రికి మాత్రం పెద్ద షాకే ఇచ్చింద‌ని స‌ర్వ‌త్రా చర్చించుకుంటున్నారు.