పతంగుల పండుగను అంత తేలిగ్గా మర్చిపోలేం. పిల్లలతో పోటీపడుతూ పెద్దలు పతంగులు ఎగురవేస్తూ ఆద్యంతం ఆస్వాధిస్తారు. సంక్రాంతి పండక్కి పతంగులు ఎగురవేయడం పిల్లలకు హాబీ. గాల్లోకి లేచిన పతంగు అంతకంతకు ఆకాశంలోకి వెళ్లిపోతుంది. గాలివాలుగా అది ఎగురుతుంటే ఎంతో ఆహ్లాదంగానూ ఉంటుంది ఆ దృశ్యం. అయితే ఒక్కోసారి దారం తెగి చెట్లు పుట్టల్లోకి వెళ్లిపోతుంది. మైదానంలో దొరక్కుండా ఎటో వెళ్లిపోతుంది. అప్పుడు వెతుక్కోవాల్సొస్తుంది. అయితే అలా వెతుక్కుంటూ వెళ్లిన పిల్లాడు మళ్లీ గాలి పటం ఎగురవేశాక ఏం విచిత్రం ఎదురైంది? అన్నది ఇదిగో ఈ టీజర్లోనే చూడాలి. ప్రఖ్యాత డిస్నీ తెరకెక్కిస్తున్న `మేరి పాపిన్స్ రిటర్న్స్` మూవీ టీజర్ ఇది. ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజవుతోంది. టీజర్లో ఓ అందమైన అనుభూతిని ఇస్తోంది. మేరి పాపిన్స్ పాత్ర ఇదివరకూ బంపర్ హిట్. ఇప్పుడు మళ్లీ వస్తోంది అదే పాత్ర. ఆకాశంలో పతంగుతో పాటు భూమ్మీదికి దిగొచ్చిన ఆ పాత్ర ఏం చేసిందన్నది తెరపై 3డిలో చూడాలి.