తెలంగాణలో నేటితో ముగియనున్న నైట్ కర్ఫ్యూ

Friday, April 30th, 2021, 08:30:45 AM IST

Hyderabad_lockdown

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం తో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేటితో ఈ నైట్ కర్ఫ్యూ ముగియనుంది. అయితే నేడు జిల్లా కలెక్టర్లతో మరియు అధికారులతో ప్రభుత్వం కార్యదర్శి సోమేశ్ కుమార్ భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న పరిస్థితుల పై సమీక్ష జరిపి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాత్రి కర్ఫ్యూ 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం లో పాజిటివ్ కేసులు మరియు మరణాలు ఏ మాత్రం కూడా తగ్గుముఖం పట్టడం లేదు. అయితే రాత్రి కర్ఫ్యూ ను ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు, మంత్రులు లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదని తేల్చి చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.