కోలీవుడ్ లోకి… మెగా హీరోయిన్ ?

Thursday, February 16th, 2017, 11:22:09 AM IST


మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ”ఒక మనసు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయ నిహారిక కు ఆ సినిమా తీవ్ర నిరాశే మిగిల్చింది. ఎన్నో అంచలనాలతో ఈ సినిమాతో హీరోయిన్ గా ట్రై చేసిన నిహారిక ఆ సినిమా ఇచ్చిన పరాజయంతో చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పటికే పలువురు కథలు చెప్పినా కూడా ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. ప్రస్తుతం నాన్నకూచి అనే షార్ట్ ఫిలింలో నటిస్తున్న ఈమె ఇప్పుడు కెరీర్ ని సీరియస్ గా ట్రై చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఇప్పటికే ఆ సినిమాకోసం సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తుందట !! ఆరుముగా కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అన్నట్టు ఈ చిత్రంలో కడలి ఫేమ్ గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నాడట.