మెగా హీరోయిన్ కోలీవుడ్ ఎంట్రీ ఖరారు?

Monday, February 20th, 2017, 11:00:34 PM IST


మెగా డాటర్ నిహారిక తెలుగులో పెద్దగా ఇమేజ్ తెచ్చుకోలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓక మనసు సినిమా ప్లాప్ అవ్వడంతో ఆశలు నిరాశలయ్యాయి. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో తెలుగులో అయితే లాభం లేదనుకుని కోలీవుడ్ లో ట్రై చేయాలనీ ఫిక్స్ అయింది. ఆ దిశగా సన్నాహాలు జరిగి ఇప్పుడు తమిళ్ డెబ్యూట్ ఖరారైంది, ఖరారు కావడమే కాదు ఈ రోజు ఆ సినిమా చెన్నై లో సంస్థ కార్యాలయంలో అధికారికంగా లాంచ్ అయింది. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ నిహారిక. ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని 7 సి ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలిసింది. తెలుగు అమ్మాయిలకు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న విషయం ఇప్పటికే కొంతమంది తెలుగు భామలు నిరూపించారు. మరి వారి దారిలోనే నిహారిక కూడా అక్కడ హీరోయిన్ గా సెటిల్ అవుతుందో లేదో చూడాలి !!