మెగా నటి పెళ్లి ఆగినట్టేనా..?

Sunday, April 29th, 2018, 03:07:04 PM IST

ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక ఇటీవ‌ల హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. హ్యాపీ వెడ్డింగ్ చిత్రం మార్చిలో విడుద‌ల కానుందని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కాని ఈ సినిమా రిలీజ్‌పై ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు… ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ముందుగా మార్చిలో విడుద‌ల‌వుతుంద‌ని అనుకున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్రం సమ్మర్ రేస్ లో ఉంద‌ని అన్నారు. కాని స‌రైన డేట్ దొర‌క‌క‌పోవ‌డం.. నిహారిక‌, సుమంత్‌ల కాంబినేష‌న్‌పై పెద్ద‌గా క్రేజ్ లేక‌పోవ‌డంతో సినిమా రిలీజ్‌కి బ్రేక్ ప‌డింద‌ని అంటున్నారు. చిత్ర నిర్మాత‌లుగా యూవీ క్రియేషన్స్ లాంటి భారీ సంస్థ ఉన్నా ఈమూవీకి హైప్‌ తీసుకు రావడంలో విఫలం అవుతున్నారు అని తెలుస్తోంది. అయితే ఈసినిమా రిజల్ట్ పట్ల నిహారికకు మంచి నమ్మకం ఉండటంతో ఈమూవీని ఏదో విధంగా ఈసమ్మర్ రేస్ లో విడుదల చేయించడానికి మెగా కాంపౌండ్ ద్వారా ప్రయత్నిస్తోంది అన్న వార్తలు కూడ ఉన్నాయి. మ‌రో వైపు సుమంత్ తండ్రి ఎమ్‌.ఎస్‌. రాజు చిత్రం ప‌ట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నాడ‌నే టాక్ వినిప‌స్తుంది. మ‌రి ఇలాంటి పరిస్థితుల‌లో హ్యాపీ వెడ్డింగ్ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపై సందేహాలు నెల‌కొన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments