బ‌యోగ్ర‌ఫీలో రొమాంటిక్‌ క‌థ‌లు అల్లాడంటూ హీరోయిన్‌ ఫైర్‌!

Wednesday, October 25th, 2017, 10:30:23 AM IST

ఓ అంద‌మైన అనుభ‌వం.. ఆ రేయి క్యాండిల్ లైట్ వెలుగుల్లో .. అంద‌మైన అమ్మాయితో అనుభూతి.. అంటూ బాబూ మోషాయ్ న‌వాజుద్దీన్ సిద్ధిఖి ఫాంట‌సీ లైఫ్‌ని పుస్త‌క రూపంలో ఆవిష్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. `యాన్ ఆర్డిన‌రీ లైఫ్‌` మోమోరియ‌ల్స్ పేరుతో ఈ పుస్త‌కం రిలీజ్ కానుంది. రీసెంటుగానే .. ఒకానొక అంద‌మైన అనుభ‌వం గురించి రొమాంటిక్ బెడ్ రూమ్ లైఫ్ గురించి న‌వాజుద్దీన్ రాసుకున్న విష‌యం సంచ‌ల‌నం సృష్టించింది. నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్ష‌ణ పొందుతున్న టైమ్‌లో త‌న మొద‌టి స్టేజీ షో ముగించుకుని బ‌య‌టికి వ‌చ్చాక‌.. వ‌ర్షంలో అంద‌మైన యువ‌తి ప‌రిచ‌య‌మైందని, ఆ యువ‌తి కూడా నేష‌న‌ల్ స్కూల్ ఆప్ డ్రామా లో శిక్ష‌ణ పొందింద‌ని చెప్పాడు. అయితే ఏడాదిన్న‌ర డీప్ ల‌వ్ తర్వాత ఒకానొక రోజు త‌న‌కి టాటా చెప్పేసింద‌ని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశాడు.

తాజాగా త‌న కోస్టార్ .. మోడ‌ల్ ట‌ర్న్‌డ్ హీరోయిన్ నీహారిక సింగ్ తో ఎఫైర్ గురించి న‌వాజుద్దీన్ పుస్త‌కంలో ప్ర‌స్థావించాన‌ని తెలిపాడు. మిస్ ల‌వ్‌లీ చిత్రంలో క‌లిసి త‌న‌తో న‌టించాను. ఆన్ లొకేష‌న్ త‌న‌ని ముద్దాడేవ‌ర‌కూ అంత‌కుముందు ముద్దు అన్న‌దే రుచి ఎరుగ‌న‌ని తెలిపాడు. ఆ క్ర‌మంలోనే త‌న‌తో డీప్ ల‌వ్‌లో ప‌డ్డాన‌ని, ఇద్ద‌రూ ఏడాదిన్న‌ర ప్రేమించుకున్నాక ఆ ప్రేమ‌బంధం వీగిపోయింద‌ని తెలిపాడు. అయితే నీహారిక ఇంటికి తొలిసారి వెళ్లిన‌ప్పుడు త‌న‌కి ఊహించ‌ని ట్రీట్ ల‌భించింద‌ని, క్యాండిల్ లైట్ వెలుతురులో త‌న‌తో బెడ్ రూమ్ అనుభ‌వాన్ని పోయెటిక్‌గా వ‌ర్ణించాడు. అయితే ఇవ‌న్నీ క‌ట్టు క‌థ‌లు.. త‌న ఆటోబ‌యోగ్ర‌ఫీ అమ్మ‌కాలు పెంచుకునేందుకు క‌ల్పిత క‌థ‌లు రాయించాడ‌ని ఫైరైంది నీహారిక సింగ్‌. న‌వాజుద్దీన్ ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని, త‌నో గొప్ప న‌టుడ‌ని పేర్కొంది. బాబూమోషాయ్‌లో వేషాలన్నీ ఒక్కొక్క‌టిగా ఇలా బ‌య‌టికొస్తున్నాయ‌న్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments