సైరాలో మెగా డాటర్?

Thursday, July 26th, 2018, 05:59:03 PM IST

మెగాస్టార్ చీరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా:ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే సినిమాలో మెగా డాటర్ నిహారిక కూడా నటించనుందని తెలుస్తోంది.

ఇప్పటికే నిహారిక కొన్ని సినిమాల్లో చేసి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవిత గారితో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం అవకాశం మిస్ చేసుకోను అని ఎన్నో ఇంటర్వ్యూలలో నీహారిక తెలుపగా ఇప్పుడు ఊహించని విధంగా అదృష్టం ఆమెను వరించింది. ఒక గిరిజన యువతి పాత్రకు నిహారికను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే సైరా షూటింగ్ శరవేగంగా మందుకు సాగుతోంది. నయనతార సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments