ప్రభుదేవా మ్యాటర్ పై స్పందించిన నికిషా!

Sunday, May 13th, 2018, 05:11:05 PM IST

టాలీవుడ్ లో కొమరం పులి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నికిషా పటేల్. పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత నికిషా పెద్గగా ఆఫర్స్ అందుకోలేదు. ఇకపోతే అక్కడక్కడా ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ ను చక్కబెట్టే ప్రయత్నం చేస్తోన్న ఈ బ్యూటీ ఇటీవల ప్రభుదేవాపై కొన్ని కామెంట్స్ చేసిందని వార్తల్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. వీలైతే ప్రభుదేవాని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని చెప్పినట్లు ఇటీవల కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ విషయంపై నికిషా స్పందించింది. అనవసరంగా తనపై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని ప్రభుదేవ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పింది. అంతే కాకుండా ఆయన్ను తాను సర్ అని పిలుస్తాను అని చెబుతూ మొన్నటి వరకు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments