నిఖిల్ స‌ర‌స‌న రాక్ష‌సి

Monday, May 14th, 2018, 04:14:13 PM IST

విల‌క్ష‌ణ‌మైన క‌థ‌లు ఎంచుకుని, కొత్త‌ద‌నాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌డంలో నిఖిల్ త‌ర‌వాతే ఎవ‌రైనా. ఈ యంగ్ హీరో న‌టించిన `కిరాక్ పార్టీ` ఇటీవ‌లే రిలీజై విజ‌యం సాధించింది. త‌దుప‌రి నిఖిల్‌ `ముద్ర` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. టి.ఎన్‌.సంతోష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `క‌నిధాన్‌`కి ఈ సినిమా రీమేక్ అని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే సంతోష్ టీమ్ మాత్రం ఈ సినిమా రీమేక్ కాద‌ని, కేవ‌లం `క‌నిధాన్‌` నుంచి స్ఫూర్తి పొంది తెర‌కెక్కిస్తున్నామ‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ స‌ర‌స‌న అందాల రాక్ష‌సి ఫేం లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని తెలుస్తోంది.

నిఖిల్‌- లావ‌ణ్య జోడీ తొలిసారి .. ఈ యంగ్ పెయిర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినిస్తార‌నే భావిద్దాం. ఈ మంగ‌ళ‌వారం నుంచి లావ‌ణ్య సెట్స్‌కి హాజ‌ర‌వుతోంది. ముద్ర పూర్తిగా నిఖిల్ శైలి వినోదంతో కూడుకున్న భారీ యాక్ష‌న్ సినిమా అని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments