కర్ణాటక ఎలక్షన్స్ పై నిఖిల్ కామెంట్స్!

Tuesday, May 15th, 2018, 12:35:02 PM IST

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం మొదలు పెట్టారు. 2019 ఎన్నికలకు ఎంతో కీలకమైన ఈ రిజల్ట్స్ పై దేశ వ్యాప్తంగా ఆకర్షితులు అవుతున్నారు. కాంగ్రెస్ పుంజుకుంటుంది అని అంతా భావించారు. కానీ ఊహించని దెబ్బ తగిలింది. గెలుపు దిశగా బీజేపీ వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ ఫలితాలపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఎవరు ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు. ” డిమానిటైజేషన్ (నోట్ల రద్దు) జీఎస్టీ అలాగే విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు – ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీలను
నెరవేర్చకపోయినప్పటికీ భారత జనతా పార్టీ మరోసారి గెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెజీషియన్ లా కనిపిస్తున్నారు. కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందే. బీజేపీ పార్టీకి అమిత్ షాకి శుభాకాంక్షలు” అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.

Comments