లవ్ బ్రేక్ అప్ అయిందంటున్న పవన్ హీరోయిన్ ?

Saturday, May 26th, 2018, 06:02:17 PM IST

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కొమరం పులి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ నిఖిషా పటేల్ కు ఆ సినిమా పెద్దగా కెరీర్ కు ఉపయోగపడలేదు. ఆ తరువాత పలు చిత్రాలు చేసినా కూడా లాభం లేకపోవడంతో పాపం ఈ అమ్మడు అటు తమిళ, కన్నడ భాషల్లో ప్రయత్నాలు చేసింది. అయినా కెరీర్ గాడిలో మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నిఖిషా మాట్లాడుతూ .. తన ప్రేమ విఫలం కావడానికి కారణం సినిమాలే అని చెప్పింది? నిజానికి సినిమాల్లోకి రాకముందే ఓ వ్యక్తి తో ఘాటు ప్రేమాయణం నడిపిందట. ఆ ప్రేమ విషయం పెద్దలదాకా వెళ్లి వాళ్ళచే అంగీకారం కూడా జరిగిందట పెళ్ళికి.. .. అయితే అనుకోకుండా ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతగాడు సినిమాల్లోకి వద్దని వారించినా వినకుండా ఎంట్రీ ఇచ్చింది. దాంతో అతగాడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడట. అలా సినిమాల వల్ల తన లవ్ బ్రేక్ అప్ అయిందని చెప్పింది నిఖిషా! ఇక తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడు తప్పకుండా చేసుకుంటానని చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments