పవన్ కళ్యాణ్ తో నటించడం ఇష్టం లేకుండానే ఆ సినిమా చేశానంటున్న హీరోయిన్

Tuesday, December 27th, 2016, 01:25:32 PM IST

nikisha-patel
నిఖీషా పటేల్ ఈ పేరు వినగానే అందరికీ ”కొమరం పులి” గుర్తుకొస్తుంది. కానీ ఆ సినిమాలో తనకు ఇష్టం లేకుండానే చేసానంటుంది నిఖిషా. ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కొమరం పులి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే నిఖిషా పటేల్ తెరంగేట్రం చేసింది. పవన్ సినిమాలో చేస్తే వరుసగా ఆఫర్లు వస్తాయనుకుంది, కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో తరువాత ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.

ఈ విషయంపై నిఖిషా పటేల్ మాట్లాడుతూ… అసలు తాను బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేద్దాం అనుకున్నానని చెప్పింది. కొమరం పులి సినిమాలో నటించడం తనకు ఇష్టంలేదని, కానీ దర్శకుడు సూర్య ఒత్తిడి చేయడం వల్లే ఆ సినిమాలో నటించానని ఆమె చెప్పింది. నాకు అసలు ప్రాంతీయ భాషల సినిమాలలో నటించడం ఇష్టం ఉండదని సూర్య ఒత్తిడి చేసి నాతో ఆ సినిమా చేయించాడని, అయితే ఆ సినిమా దారుణ పరాజయం అవడంతో తనకు తరువాత అవకాశాలు రాలేదని ఆమె చెప్పారు. చాలా ఏళ్ళు ఖాళీగానే ఉన్నానని, అయితే ఇప్పుడిప్పుడే కొన్ని అవకాశాలు వస్తున్నాయని నిఖిషా వచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments