హాట్ పిక్ : ఆ చూపులు, ఆ ఫోజు..యువకుల మనసు గల్లంతే..!

Thursday, January 18th, 2018, 09:02:08 PM IST

ఈ మధ్యన సోషల్ మీడియాలో వెండి తెర భామల కంటే బుల్లితెర భామల హవా ఎక్కువైపోయింది. హీరోయిన్లుగా అవకాశాలు అందుకోవడం కోసం బుల్లితెరపై రాణించి అందగత్తెలుగా ప్రశంసలు అందుకున్న భామలంతా వెండితెరపై కనిపించాలని కలలు కంటున్నారు. గ్లామర్, అభియనం ఉంటె ఎప్పటికైనా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

బుల్లితెరపై సందడి చేస్తున్న నిఖిత శర్మ కు త్వరలోనే ఆ అవకాశం దక్కవచ్చు. నటిగా ఇప్పటికే బుల్లి తెరపై మంచి పేరు కొట్టేసింది. ఇక సోషల్ మీడియా వేదికగా అందాన్ని వెదజల్లుతూ కుర్రకారుతో పాటు దర్శక నిర్మాతలని ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. రీసెంట్ గా నిఖిత శర్మ ఫొటో షూట్ లో పాల్గొన్న దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోజు చూస్తే కుర్రకారు ఆమె అందానికి దాసోహం అనక మానరు.