బాహ‌మాస్ ముప్పు: నిమ్మ‌గ‌డ్డపై ఆస్తుల‌పై ఎంక్వైరీ?

Friday, September 23rd, 2016, 11:55:26 AM IST

Nimmagaada-Prasad
ప‌నామా ప‌త్రాల సంచ‌ల‌నం మ‌ర్చిపోక‌ముందే బ‌హ‌మాస్ లీకేజీ అంటూ మ‌రో వార్త భ‌ళ్లున పేలింది. నిన్న‌టి సాయంత్రం నుంచి టీవీ చానెళ్ల‌లో ఇదే హాట్ టాపిక్‌. ఇందులో ముఖ్యంగా హైద‌రాబాదీలు .. పారిశ్రామిక‌వేత్త‌లు అయిన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌కాశ్ పేర్లు వినిపించాయి. మొత్తం 475 మంది భార‌తీయుల పేర్లు లీకైన జాబితాలో ఉన్నాయి. తెలుగువాళ్ల‌కు సంబంధించిన 25 కంపెనీల పేర్లు ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1.75 ల‌క్ష‌ల పేర్లు బైట‌ప‌డ్డాయ్‌. వేదంత గ్రూప్ అనీల్ అగ‌ర్వాల్‌, ఫ్యాష‌న్ టీవీ ప్ర‌మోట‌ర్‌ అమ‌న్ గుప్తా పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. సికింద‌రాబాద్‌కి చెందిన ఒకే అడ్రెస్‌పై మొత్తం 25 కంపెనీలు బ‌హ‌మాస్‌లో కంపెనీలు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.

మ‌న డ‌బ్బును మొత్తం బ‌హ‌మాస్‌కి త‌ర‌లించారు. వీళ్లంతా స్థాపించింది సూట్ కేస్ కంపెనీలే. ఇవి కేవ‌లం న‌ల్ల‌డ‌బ్బును తెల్ల‌డ‌బ్బుగా మార్చుకునేందుకు స్థాపించిన కంపెనీలు. ఈనెల 30 లోగా కేంద్రం న‌ల్ల‌కుబేరుల‌పై ద‌ర్యాప్తు జ‌రిపించ‌డం ఖాయంగా చెబుతున్నారు. ముఖ్యంగా నిమ్మ‌గ‌డ్డ ఫ్యామిలీ పేర్లు వినిపించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. అత‌డిపై కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాయో? లీకైన కంపెనీల‌పైనా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాయి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.