రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్…ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

Friday, July 31st, 2020, 02:29:17 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులను జారీ చేసింది. మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ప్రకటనలో తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన గెజిట్ ను విడుదల చేయాలి అంటూ పంచాయతీ రాజ్, గ్రామీణ భివృద్ది శాఖ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

అయితే సుప్రీం కౌర్ తుది తీర్పు కి లోబడి ఈ పదవి పునరుద్దరణ పై నోటిఫికేషన్ ఉంటుంది అని తెలిపింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం తో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్ గా తొలగుంచింది. అయితే న్యాయస్థానాలను ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్టకేలకు మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహించ నున్నారు.